నానీలు - పుస్తకావిష్కరణలు

ఈ పుస్తకావిష్కరణ పేజీలో వివిధ నానీ కవుల నానీ సంపుటాల ఆవిష్కరణ దృశ్యాలు,వివరాలు పొందుపరచడం జరుగును.  
ఇండియన్ హైకు క్లబ్ ప్రచురణలో డా.తలతోటి పృథ్వి రాజ్ ,జి.రంగ బాబు,బద్ది నాగేశ్వర రావు,గట్టి బ్రహ్మాజీ రచించిన నానీల తొలి సంకలనం "నలుదిక్కుల నానీలు".ని  శ్రీ జూకంటి జగన్నాధం 19 సెప్టెంబర్ 2010 న అనకాపల్లి లో జరిగిన నానీల సదస్సులో ఆవిష్కరించిన దృశ్యం.(కుడినుండి ఎడమకు:ఎస్.కమలాకర రావు,డా.తలతోటి పృథ్వి రాజ్,జి.రంగ బాబు,బద్ది నాగేశ్వర రావు, ఆవిష్కర్త జూకంటి జగన్నాధం,సి.ఎస్.రావు,డా.కె.ఎస్.ఈశ్వర రావు,హైకు క్లబ్ మహారాజ పోషకులు బి.వి.బంగార్రాజు,జి.బ్రహ్మాజీ.)  
డా.తలతోటి పృథ్వి రాజ్ రచించిన నానీల సంపుటిని నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి 13 నవంబర్ 2004 న ఇండియన్ హైకు క్లబ్ అధ్వర్యంలో నిర్వహింపబడిన సభలో ఆవిష్కరింపబడిన దృశం. (ఎడమనుండి కుడికి:నానీ బాణీలు ఆడియో ఆవిష్కర్త డా.కె.విష్ణుమూర్తి,ఎన్.అరుణ,డా,ఎన్.గోపి,డా.తలతోటి పృథ్వి రాజ్,ఎస్.ఆర్.భల్లం మరియు సోమేపల్లి వెంకట సుబ్బయ్య ) 
డా.మచ్చ హరిదాసు రచించిన "గోరు కొయ్యలు"నానీల సంపుటి ఆవిష్కరణ 7 అక్టోబర్ 2006  న కరీంనగర్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో  జరిగినది.  కుడి వైపు:డా.మచ్చ హరిదాసు,డా.సంగనభట్ల నరసయ్య,మాడిశెట్టి గోపాల్,సబ్బని లక్ష్మీ నారాయణ,అన్నవరం దేవేందర్ గార్లు. ఎడమ వైపు:శ్రీమతి మచ్చ భారతి,శ్రీమతి ఎన్ .అరుణ,డా.గండ్ర లక్ష్మణ రావు ,టి.ప్రమోద్ కుమార్ గార్లు  

24 ఏప్రిల్ 2008  న గుంటూరు బృందావన్ గార్డెన్స్ వద్ద అన్నమయ్య కలావేదికలో "మనిషికోసం"నానీల సంపుటిని ఆవిష్కరిస్తున్న ఆచార్య తేళ్ళ సత్యవతి. చిత్రంలో (కుడినుండి ఎడమకు)డా.పి.వి. సుబ్బా రావు,గద్దె రామ తులశమ్మ ,తేళ్ళ సత్యవతి,కవి నాగిశెట్టి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య,ఎస్.ఆర్.భల్లం,రవికుమార్,శ్రీనివాస్ తదితరులు.  
24 సెప్టెంబర్ 2006 న గీతా రెసిడెన్సీ లోని సాంస్కృతిక కాన్ఫరెన్స్ హాల్ లో "గడ్డి చామంతులు" నానీల సంపుటిని ఆవిష్కరిస్తున్న ఆచార్య ఎన్.గోపి. చిత్రంలో గుంటూరు నగర మేయర్ కన్నా నాగరాజు,ప్రముఖ కవి సోమేపల్లి వెంకట సుబ్బయ్య,కవి నాగిశెట్టి. ప్రఖ్యాత రచయిత్రులు శ్రీమతి ఎన్.అరుణ,డా.చిల్లర భవానీ దేవి  


ఎడమనుండి కుడికి:బీరం సుందర్రావు,పాతూరి అన్నపూర్ణ,పెళ్లకూరు జయప్రద,డా.శ్రీనివాస తేజ,డా.ఎండ్లూరి సుధాకర్,చిల్లర భవానీదేవి,కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి,ఎస్.వి.కృష్ణ 
కుడినుండి ఎడమకు :
పల్లె నానీలను ఆవిష్కరిస్తున్న డా.గోపు లింగా రెడ్డి,అన్నవరం దేవేందర్,డా.బి.వి.ఎన్.స్వామి,పుస్తక రచయిత కూకట్ల తిరుపతి ,దాస్యం సేనాధిపతి ,కె.ఎస్.ఆనందాచార్య తదితరులు.